నిజమే , పోరాడితే పోయేదేమీ లేదు , బానిస సంకెళ్ళు తప్ప ....
తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలన్న మా కల నిన్న పార్లమెంట్ ఆమోదం తో నెరవేరింది . ఆరు దశాబ్దాల మా కల సాకారమైంది . ఇది మా గెలుపు సీమంద్ర ఓటమి ఎంత మాత్రం కాదు . ఉద్యమంలో గెలుపు ఓటములు ఉండవు , హక్కుల సాదన మాత్రమే ఉంటది . ఈ పోరు తో మా స్వపాలన , స్వాలంబన హక్కులను సాదించుకున్నము . ఆరు దశాబ్దాల బానిసత్వ పాలనా నుండి విముక్తి పొన్దినాము .
ఈ వ్యాసం రాస్తుంటే పోరు బాట స్మృతులు గుర్థుకస్తున్నయి , కళ్ళు చెమ్మగిల్లుతున్నయ్ , జ్ఞాపకాలు ఒక్కొకటి గుర్తుకస్తున్నాయి . ఒక కల కని , అ కల కోసం పోరు చేసి అది మన కళ్ళ ముందు సాకారము అవుతుంటే ఆ ఆనందానికి హద్దులే ఉండవు .
తెలంగాణా సాదన తో నా జీవితం లో ఒక్క పెద్ద శకం ముగిసింది , ఎందుకో ఈ రోజు వెనుకకు తిరిగి జీవితం లోని ఇప్పటి వరకు అనుభవించిన కష్ట సుఖాలు , సాఫల్యాలు వైఫల్యాలు బ్యరెజి వెసుకోవలని అనిపిస్తున్నది . ఈ ఆనంద వేల అన్ని గుర్తుకు వస్తున్నాయి , కళ్ళ ముందు ఆవిష్కరించా బడుతున్నాయి . అప్పుడప్పుడు జీవితం లో ఆగి పాత జ్ఞాపకాలలో సేద తీరాలి . నాకు తెలిసినంత వరకు మనస్సు కు జ్ఞాపకాలే స్థిర ఆస్తులు . ఈ రోజు నా ఆ ఆస్తుల లెక్క కట్టాలని అనిపిస్తుంది .
అమ్మాయి ప్రేమ లో పడ్డ ప్రేమికుడు ఎలాగయితే తన మొదటి చుంబనం , మొదటి కౌగిలి మర్చిపోడో , అలాగే ఉద్యమ బాట పట్టిన ఉద్యమకారుడు కూడా తన మొదటి నినాదం , తన మొదటి పోరు అడుగులను ఎన్నటికి మరవలేదు . ఉద్యమకారుడు కూడా ఒక్క ప్రేమికుడు లాంటి వాడు , తన ప్రెమ కోసం ప్రేమికుడు తన జేవితము లోని అన్ని నిస్వర్దముగ దారపోసినట్టు ఉద్యమకారుడు కూడా తను నమ్మిన అ లక్ష్యం కోసము తన జీవితాని పోరు బాట కు అంకితం చేస్తాడు . ఇవన్నీ మదురమైన జ్ఞాపకాలు , మనసును అహ్లదపరిచెయవి , గుండె ను నిబ్బరంగా ఉంచేవి . నేను చెప్పే ఈ అనుబుతులు ఊహ కు అందనివి , ఇవి అనుభవిస్తేనే తెలుస్తుంది .
నేను రెండు అనుభవించాను , వాటి లో ఉన్న కష్ట సుఖాలను ఆస్వాదించాను . ఇవి నాకు జీవితాన్ని ఒక్క కొత్త కోణం లో చుపించినయి , నేను నా జీవితము లో పెద్దగ సాదించింది ఏమి లేదు , కాని ఇవి నేర్పిన గునపాటలు లెక్క కట్ట లేనివి , వాటిని అక్షర రూపం లో పెడితే ఒక భాండాగారం అవుతుంది .
ఈ ఆనంద హెల ఏమేమో రాయల అని అనుకున్న , కని ఏమి రాయలి , ఎక్కడి నుండి ప్రారంబం చేయాలి అర్ధం కావట్లేదు . అందుకే రాయటము ఆపేసి గుర్తుకు వస్తున్నా ఆ మధుర జ్ఞాపకాల్లో సేద తీరుత .
తెలంగాణా అమర వీరులకు జాతీయ విప్లవ జోహార్లు !
ఈ విజయం మా త్యాగధనులకు అంకితం !!
జై తెలంగాణా !!!
No comments:
Post a Comment