ద్రావిడార్ కళగం పిలుపు నందుకుని తాళి తెంపిన 25 మంది మహిళలు....
Few days back few Atheists/Feminists have conducted an a event to remove Mangalsutras to prove they are liberated and modern woman. No one shud object if it is their personal and private choice , but conducting it publicly is deliberate attack on Hindu rituals. Below is the Telugu compilation from various sources. It gives a glimpse of importance of Mangal Sutra for a married woman.
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!!
Meaning: " ఓ ప్రియ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు"
హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత నుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడులనుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము భర్త ఆయుషు కు ప్రతిక అని హిందువులు నమ్ముతారు.
అబ్బాయి త్రిమూర్తులు ( బ్రహ్మ, విష్ణు, శివుడు) ఏ విదంగా ఐతే వారి వారి జంటలుగా సృష్టి జరిపారో వారి లాగానే తాను కూడా ఎటువంటి బేదం లేకుండా అంటే బర్త అన్న అహంకారం కాని గర్వం లేకుండా బార్య ను తన లో ఒక్క భాగంగా స్వీకరిస్తాను అని అగ్ని, దేవి - దేవతలా సాక్షి గ ప్రమాణం చేస్తాడు.
మంగళసూత్రంలో ముత్యం,పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది. భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమిటంటే
ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయినది.ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు(కుజుడు)తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను,దోషాలను తోలిగిస్తాయి అన్ హిందువుల నమ్మకం .
కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం,పగడం రెండూకూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంతశుభపలితాలు సమకూర్చగలవు.మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మరువకూడదు, అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు.
ప్రతి స్త్రీ జీవితంలో ఈ పై చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే యిక జీవితం ఆనందమయమే.
No comments:
Post a Comment