Thursday, November 10, 2011

The Advt that bothered me



సికింద్రాబాద్ రైల్ స్టేషన్ ముందే బస్సులు ఆగుతాయి . వీకెండ్ తర్వాత స్టేషన్ లో ట్రైన్ దిగి ఆఫీసు కు వెళ్ళడానికి ఆటో ఎక్కుతుంటాను . ఆటో లో కూర్చొని, ఏ లోకల్ బస్సు ఫై చుసిన  ఒక్కటే advertisement కనిపించేది . అది " ప్రియ సిమెంట్ " దానికి ఇంగ్లీష్ లో ట్యాగ్ లైన్ Lasts Long అని . ఒక్కటి కాదు రెండు కాదు హైదరాబాద్ లో ఉన్న అన్ని సిటీ బస్సు లా ఫైన అదే . నాకు ఆ advertisement చూడగానే ఏవేవో గుర్తుకు వచ్చేవి  దాని  Lasts Long అనీ ట్యాగ్ లైన్ అస్సలు నచ్చలేదు .

మనల్ని ఇబ్బంది పెట్టె జ్ఞాపకాలు కనిపిస్తే ఎంత తిక్క లేస్తాడో మీకు తెలిసిందే  . నా పరిస్తితి మరి దారుణం , హైదరాబాద్ లో దిగగానే కనిపించేది ఈ ప్రియ సిమెంట్ advertisement ఉన్న బస్సులే . ఆఫీసు కు వెళ్ళే తప్పుడు , సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు నన్ను వెక్కిరిస్తూ గేలి చేసేవి . ప్రతి రోజు ఇంతే సంగతులు , వొళ్ళు మంది పోయేది .

ఈ advertisement ఫై బ్లాగ్ లో ఒక  పోస్ట్ రాద్దామని డిసైడ్ అయ్యా  . The Advt , that bothers me అని టైటెల్ పెడుదమనుకున్న . దానికి తగ్గట్టు ఆ బస్సు ఫోటో తీసి బ్లాగ్ లో పోస్ట్ చేదామని నా జేబు లో ఉన్న Sony Ericcson కెమెరా ఫోన్ తీసి క్లిక్ చేద్దామని జేబు లో ఉన్న ఫోన్ తీసా , కాని బస్సు స్టాప్ లో చాల మంది అమ్మాయిలు ఉన్నారని, మల్లి అల్లానే ప్యాంటు జేబ్లో పెట్ట . కాస్త ముందుకెళ్ళి ఆటో కోసం వెయిట్ చేస్తూ జేబు తరుముకొని చుస్తే ఫోన్ లేదు .

కాస్త ఇష్టమైన వస్తువు  పాయినది కదా కొంచం కంగారు పడ్డ , నా ఆటో వాడు అదేదో నేను కోహినూర్ వజ్రం పోగుట్టుకున్నాటు  వాడు నా చుట్టూ వెతకడం మొదలు పెట్టాడు . వాడి హడ-వీడి చుసి ఆటో కోసం వెయిట్  చేసే జనం మరీయు పాదచరులు కూడా ఓ అయ్దరుగురు గుమ్మి గుడారు . ట్రాఫ్ఫిక్ సిగ్నల్ వద్ద అర నిమిషం లేటు అయ్యిన చిరాకు పడే Motorist, స్కూటర్ ఫై వెళ్ళే వారు సైతం నా ఆటో వాడి హల చల్  చూసి ఆగారు .

అందరిది ఒకే ప్రశ్న ' ఏమి పోగుట్టుకున్నావ్ ....దాని ధర ఎంత ...చాల ఖరిడ్ అయినదా ??' . జనాలకి జవాబు చెప్పకుంటే నన్ను వదలె లా లేరు . రెండు సంవత్సరాల కింద కోన్న సెల్ ఫోన్ , ఇప్పుడు అంత కరీడైంది ఏమి కాదు అన్న . నేను పాత సెల్ అని చెప్పే సరికి పబ్లిక్ కాస్త disappoint అయ్యారు, ఒక్కో-ఒక్కరు జారుకున్నారు . అమ్మయ్య ఈ జనల పద్మవ్యూహం నుండి బయట పడ్డందుకు సంతోషిస్తూ  అదే ఆటో ఎక్కి ఆఫీసు కి చేర .

నాకు ఎవ్వరి నెంబర్ గుర్తు లెవ్వు , ఒక్కరి నెంబర్ మాత్రమే గుర్తుంది అది సౌమిత్రి లక్ష్మణచార్య . ఎవరి తో ఒక్కరి తో బాద పంచుకోవాలి గా, లక్ష్మణచార్య కు విషయం చెప్పి మరో మిత్రుడు రవి నెంబర్ తీస్కున్న . తర్వాత రవి కి కాల్ చేసి చెప్పా . అసలు రవి కాల్ చేయడం లో నా ఉద్దేశం Airtel లో ఒక కొత్త ఫాన్సీ నెంబర్ తీసి పెట్టమని . రవి వృత్తి రిత్య Chartered Accountant మరీయు Airtel  స్థానిక verifications అతని కార్యాలయం చుసుకుంటది , అందుకే అతని పరపతి తో కొత్త ఫాన్సీ నెంబర్ తీస్కుందాం అనుకున్న . అన్ని మాట్లాడ కానీ అది ఒక్కటి చెప్పడం మర్చి పోయా . నా పాత నెంబర్ తో చాల bad memories ఉన్నాయి , వాటీని వదిలించు కోవలనుకున్న . కాని నేను తలిచింది ఒక్కటైతే జరిగింది ఇంకోటి . Next day రవి కి కాల్ చేసే సరికి నీ పాత నెంబర్ తో కొత్త సిమ్ కార్డు తెప్పించి పెట్టాను అని బాంబ్ పేల్చాడు . అలా ఫోన్ తో పాత నెంబర్ ను వదిలించు కుందాం అనుకున్న అది సాధ్యపడలేదు

అప్పటి వరకు సెల్ పాయిందన్న భాద వుంది , కానీ తద్ఫలితంగా వచ్చే సమస్యను గుర్తించలేక పోయా . అసలు సమస్య ఆఫీసు కి వచ్చాక మొదలైంది . మా తమిళనాడు ఆఫీసు మేనేజర్ కు , మా కంపెనీ డైరెక్టర్ల కు ఫోన్ చేయాల్సి వచ్చింది . ఒక్కరి నెంబర్ కూడా గుర్తు లేదు , ఫోన్ లిస్టు బ్యాక్ అప్ లేదు , ఆఫీసు ఫోన్ డైరీ maintain చేయలేదు . ఫోన్ లిస్టు లాప్-టాప్ లో బ్యాక్ అప్ తీయనందుకు నన్ను నేను తిట్టు కుంటూ , అందరికి మెయిల్స్ పెట్ట . అందరికి నా ఆఫీసు లోని ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్ఛా .

మెయిల్స్ చదివి వదిలేస్తే బాగానే ఉండేది జనల , దొరికిపోయాడు అనుకున్నారేమో . మెయిల్ చదివిన ప్రతి వాడు ఫోన్ చేసి అడగడం 'ఎలా పోయింది  ... ఎక్కడ పెట్టావు ... Shirt కు ప్యాకెట్ లేకుంటే  Laptop బాగ్ లో పెట్టుకోవచ్చు కదా ... ఫోన్ లిస్టు బ్యాక్ అప్ తీయడం తెలీదా ' ఇలా ఎవ్వ్వరికి తోచిన సలహా వాడు అడగకుండానే ఇచ్చి నా బేజ ఫ్రై  చేసేసారు . ఇక సందు దొరకినది కదాని ఒక్క మహాన్బవుడు రిప్లయ్ - మెయిల్ పెట్టాడు ' యు డోంట్ హావ్ అడ్రస్ బుక్ బ్యాక్ అప్ ..... ???? యు కాంట్ బి దట్ స్టుపిడ్ ' అని .

 వీళ్ళ లొల్లి ఏందిరా బాబు అనిపించింది, ఎవడి గోల వాడిదే, వీళ్ళ సంగతి తర్వాత చూడచ్చు కానీ ముందు అమ్మ కు చెప్పాలి లేదంటే వాళ్ళు కంగారు పడతారు . అప్పుడు తెలిసి వచ్చింది నా బ్రెయిన్ మెమరీ పవర్ ఎంత అని. ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్ కానీ నానా సెల్ నెంబర్ కానీ గుర్తుకు రావట్లేదు .

అప్పుడు తెలిసి వచ్చింది నేటి మనవ జీవితం లో సెల్ ఫోన్ యొక్క ప్రాముఖ్యత . సెల్ ఫోన్ లేకుంటే జీవితమే ఆగిపోతుందా అన్నట్టు అనిపించింది . నిజమే ఈ కాలం లో సెల్ ఫోన్ లేకుంటే మన జీవితాలే ఆగిపోతాయి . భందువుల ఇంటి కి వెళ్ళడం ఎప్పుడో మానేశాం , గుర్తు కస్తే సెల్ తీయడం రెండు నిముషాలు పలకరించి  Relationshipను కంటిన్యూ చేయడం . ఫ్రెండ్స్ తో సినిమా / షాప్పింగ్ వెళ్ళాలన్న, ఎ ప్లేస్ లో కలుస్కోవాలన్న మనం వాడేది సెల్ ఫోన్ యె . ఆఫీసు పని అయిన సెల్ ఫోన్ , లీవ్ పెట్టాలన్న  సెల్ ఫోన్ , గర్ల్ ఫ్రెండ్ / బాయ్ ఫ్రెండ్ మాట్లాడాలన్న , పోట్లదాలన్న ఆఖరికి డంప్ చేయాలన్న  ఉపోయోగ పాడేది ఈ సెల్ ఫోన్ యె . ఇలా చెప్పుకుంట పొతే మన నిజ జీవితం లో సెల్ ఫోన్ ఫై dependency  చాంతాడు అంతా అవుతది.


15 సంవత్సరాల కింద మన జీవితం లోకి వచ్చిన ఈ సెల్ ఫోన్ , ఇప్పుడు మన శరీరం లోని  భాగమైంది . దిన్ని వాళ్ళ లాభాలు ఎన్నో, నష్టాలూ అన్ని ఉన్నాయి , ఒక్కో సరి అనిపిస్తుంది ఇది మన పూర్వ జన్మ కర్మా ర అని . మనకు ప్రియా మైన వారితో మాట్లాడినప్పుడు గిలిగింతలు పెడుతే , మనకు నచ్చని వారితో ఫోన్ లో దొరకి పాయినప్పుడు  , దిన్ని ఎవరు కానీ పెట్టారో బాబు అనిపిస్తుంది .
                

2 comments:

Apparao said...

SAMSUNG / LG ఫోన్ లు అయితే మన ఫోన్లు లలో ఎన్ని సిమ్ కార్డ్స్ వేసుకున్నా మనకి మెసేజ్ లు వచ్చేస్తాయి
ఫోన్ దొంగలని పట్టుకోవచ్చు

pichhipillah said...

Phone sangathi vadilesthey,now that Im sure you would have purchased a new one obvisiously,what have you done about the advt?PRIYA cement sangathi chudu thandri,telchi untey daani kadha cheppu nayana!!