Thursday, August 6, 2015

Fight against Lord Krishna look alike NTR statues in Andhra.

కృష్ణుడిగా ఎన్‌టిఆర్ ఎంత గుర్తు ఉంటాడో అంతే రావణ బ్రహ్మగా కూడా మనకి ఆయనే కనుక ఈసారి అందరం రావణుడి వేషంలో ఉన్న ఎన్‌టిఆర్ బొమ్మలని తగలెడదాం.

ఎన్టీఆర్ ని కృష్ణుడి రూపంలో గోదావరి ఒడ్డుపై విగ్రహం ప్రతిష్టించడం తప్పు కాదనే వారికి ఈ పోస్టింగ్ ప్రత్యేకం.
తెలుగు ప్రజలకు రాముడన్నా, కృష్ణుడన్నా ఎన్టీఆర్ తప్ప మరొకరి రూపం కనపడదు. అంత అద్భుతమైన నటనా కౌశల్యం, ఆహార్యం మరొకరి లో కనపడవు. కానీ, ఇది సినిమాల వరకూ మాత్రమే. అలాగని గుళ్లోనూ, గోపురాల్లోనూ, లేదా ఇలా పబ్లిక్ ప్లేస్ ల లోనూ దేవుళ్ళ రూపంలో ఆ నటుడి విగ్రహాలు ప్రతిష్టించడం కరెక్ట్ కాదు. అది ఒకరకంగా ఎంతోమంది హిందువుల మనోభావాలను దేబ్బతీసినట్లే.

అయితే కొందరంటున్నట్లు మరెవరినీ ఆ దేవుళ్ళ రూపంలో ఊహించుకోలేము కాబట్టి తప్పులేదు అంటున్నారు. అదే నిజమనుకుందాం. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి గానే కాదు. రావణబ్రహ్మ గా అద్భుతంగా నటించారు. అలా అనిచెప్పి ఆయనంటే ఇష్టం లేని వారెవరైనా దసరా (విజయ దశమి) నాడు జరిపే రావణాసురిడి దహన కార్యక్రమాలకి ఎన్టీఆర్ రూపం తో చేసినవి పెట్టి తగులపెడితే దానికి మీరు ఒప్పుకుంటారా?

నటుడిగా ఎన్టీఆర్ ని అభిమానించని వారు వుండరు. మీరు చేస్తున్న పనివల్ల ఆ మహానటుడికి లేనిపోని అవమానాలు కలుగుతున్నాయి. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే అభిమానం ఉండొచ్చు. కానీ, అది హద్దులు దాటకూడదు. ఇది అన్ని రాజకీయ పార్టీలకూ వర్తిస్తుంది

~Hindu Jwala

No comments: