Bail for Sale, Gali Janardhan Reddy style.
15
కోట్లు... ఒక్క బెయలు కోసము , గాలి జనార్ధన్ రెడ్డి వెదజల్లిన సొమ్ము . ఆ
వార్త చువుతుంటే వొళ్ళు జలదరిస్తుంది . అందులో పాత్రదారులంతా బడా బాబులే .
ఒక్క ఖైది .. ఒక జడ్జి ... ఒక మంత్రి .... ఒక పొరుగు రాష్ట్ర MLA ....
ఒక్క రౌడి షీటర్ . ఈ వార్త చదువుతుంటే కట్టలు తెంచుకునే ఆవేశము వస్తున్నది
.... ఈ బద్మశుగాల్లను తెగనాదాలనే ఆక్రోశం ..... ఈ ఆవేశాన్ని ,ఆక్రోశాన్ని
అక్షర రూపము ఇద్దామంటే సరైన పదాలు దొరకట్లేదు .
ఒక జగన్మోహన్ రెడ్డి , ఒక గాలి జనార్ధన్ రెడ్డి వీళ్ళు రాష్ట్రం లోని
అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసారు . వీరి వలలో పడి మంత్రులు , IAS
ఆఫీసుర్లు , పారిశ్రమవేత్తలు అందరు జైలు పాలయ్యారు . ఇప్పుడు వీరి దృష్టి
న్యాయ వ్యవస్థ ఫై పడింది ..... దాన్ని కూడా బ్రష్టు పట్టించారు . నేరం మీద
నేరం జేస్తున్నారు ...ఎక్కడ కూడా శిగ్గు లజ్జ లేదు ..... దోచుకున్న డబ్బు
ఉంది కదా , దాని తో దేనినైన కొనగలం అని అనుకుంటున్నారు . అల
కొనగాలుగుతున్నారు కూడా . వీరు వేద జల్లిన కరెన్సీ కట్టలకు అమ్ముడు పాయిన
న్యాయదీషుడు పట్టాభిరాం అందుకు ఉదాహరణ .
ఈ జగన్మోహన్ రెడ్డి ,
గాలి జనార్ధన్ రెడ్డి వీలు రాజకీయ నాయకులేంటి పక్క నేరగాళ్ళు . వీళ్ళు గనక
అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్తితి ఏంటో ఆలోచించండి . ప్రజలనే బానిసలను
చేసి .... వారినే పెట్టుబడి గ పెట్టి మరి వ్యాపారం చేస్తారు . ఇక పౌర సమాజం
నిద్ర లేవాలి . వీరు మా కులస్తులనో , మా పార్టీ వాడనో సమర్దించడం మానేయాలి
..... వీలు సమాజ ద్రోహులు , ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీ దారులు
అని గుర్తెరగాలి . వీరి ఫై ఇక తిరగపడాలి లేదంటే పౌర సమాజం తీవ్రమైన మూల్యం
చెల్లించు కోవలిసి వస్తుంది . లేదంటే రాబోయే మన వారసులు మనలని క్షమించరు .
No comments:
Post a Comment