Friday, July 12, 2013

No more pleading Delhi on Telangana statehood, Lets fight and achieve it.


పోరాడి సాదిస్తేనే తెలంగాణా !! పోరాడితే పోయేదేమీ లేదు .... ఈ పరాయి పాలకుల దోపిడీ పాలనా తప్పితే . అందుకే తెలంగాణా కోసం చేయి చాచడం మనాలి , ఇక మనమే శాశించాలి . అందుకు ఊరు వాద కదలాలి యువకులు మరో సారి నడుం కట్టాలి , పిడికిలు బిగించాలి , "మా తెలంగాణా మాకు కావాలి" అని హొరెత్తించలి . పొలిసు దమనకాండకు ఎదిరించి వీదులోకి రావాలి . ఈ పరాయి పాలకులను తెలంగాణా పొలిమేర వరకు తరమాలి .

ఇక డిల్లి ముందర మోకరిల్లడం మానేద్దాం , మన తెలంగాణా ను మనమే పోరాడి సాదిద్దాం.

తెలంగాణా కు జరిగిన - జరుగుతున్నా అన్యాయాలను చెప్పుకుంటే భాగవతము అంతటి కావ్యము , రామాయణము అంతటి పుస్తకము అవుతది . ఒక్కటా , రెండా 55 సంవత్సరాల గోస , తర తరాల వేదన . యుగాలు మారినాయి , ప్రభుత్వాలు మారినాయి కాని మా తెలంగాణా బతుకులు మాత్రం మారలేదు . మాయ దరి రావణాసురిడి మాటలు విని సీతమ్మ బంది అయినట్టు మేము సీమంధ్ర మాటలు నమ్మి బందిలమయినము .

ఇక ఈ బానీస బతుకులు చాలు , బంధ విముక్తులము కావలి , అందుకు మేము పోరాడాలి , పోరాడుతున్నాము . చరిత్ర పుస్తకాల్లో ఎన్నో పోరాటాలు నమోదు చేసుకో బడ్డాయి , కాని అవి ఏవి కూడా తెలంగాణా రాష్ట్ర పోరాటమంత సుధీర్గ చరిత్ర ఉన్నటు అనిపించదు . ఇన్ని సంవత్సరాలు పరయ పాలనా లో దోపిడీ కి గురిఅయిన , హక్కులు కాలరాయ బడ్డ , రాజ్య హింస ఇనప బూటు కాలు కింద నలపేయ బడిన, ఈ తెలంగాణా జాతి తన అస్తిత్వనీ కోలుపోలేదు . ఫినిక్ష్ పక్షి లాగా మల్లి లేచింది , తన గమ్యం వైపు అలుపు లేని , రాజి లేని ప్రయాణానికి సద సిద్దమంతున్నది . అట్టి ఈ తెలంగాణా జాతి ని నేను అబినందిస్తున్న . ఆ జాతి పురుశుదినైనందుకు నేను గర్వపడుతున్న

No comments: