Wednesday, July 8, 2015

ప్రజల సొమ్ముతో హైదరాబాద్ పొలిసు కమిషనర్ ఇఫ్తార్ విందులా ?


రంజాన్ మాసంలో నిజమైన ధనిక ముస్లింలు నిరుపేద ముస్లింలను ఇంటికి పిలిచి రకరకాల వంటకాలతో వారి ఆకలిని తీర్చి వారికి కూడా పండుగ అనుభూతిని కల్పించడం ఇఫ్తార్ విందుల సారాంశం అది ముస్లిం మత ఆచారం.

పొలిసు కమిషనర్ గారు వ్యక్తిగతంగా నిజమైన నిరుపేద ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చివుంటే హర్షించేవారము కానీ హైదరాబాద్ నగర్ పొలిసు విభాగం ద్వార అధికారికంగా ఒక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతవరకు సమంజసం ? పొలిసు కమిషనర్ గారు రాజకీయ నాయకుల వలె ప్రవర్తించడం వ్యవస్థపై వున్న గౌరవానికి మచ్చ కాదా ? ప్రభుత్వ నిధుల నుండి ఈ రకంగా మతపరమైన విందులు ఇచ్చే అధికారం పొలిసు కమిషనర్ గారికి వుందా ? వుంటే మెజారిటీ ప్రజలైన హిందువులు జరుపుకొనే పండగలకు ఎందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేయరు ?

నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే బొనాలలొ కానీ గణేష్ ఉత్సవాలలో కానీ కాషాయపు టోపీ దరించి నుదిట కుంకుమ తిలకం పెట్టుకోవడానికి వీరికి అడ్డువచ్చే సెక్యులరిజం ఇప్పుడేమైంది ?


అన్ని మతాలను సమదృష్టితో చూడటమే నిజమైన సెక్యులరిజం అని చెబుతుంది మన రాజ్యాంగం ,మన రాజకీయ నాయకులు ఓట్ల వేటలో ఎప్పుడో దాని అర్థాన్ని మార్చివేశారు ,రాజ్యాంగ పరిరక్షణకై లాటీలు పట్టిన పోలీసులు నిజమైన స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తిస్తే దేశం మరోసారి భారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది . పౌర సమాజం కూడా నిర్భయంగా ఇలాంటి పోకడలను ప్రశ్నించాలి అప్పుడే ఎవరి హద్దుల్లో వారు వుంటారు.



మాధవిమక్కరాజ్పేట్


No comments: