శివాజీ వయస్సు అప్పుడు 12 ఏండ్లు. ఒక్కరోజున అతడు బీజాపూర్ రాజమార్గం మీదుగా వెళ్తున్నాడు. శివాజీ ఒక్క దృశ్యం కంటపడింది, ఒక కసాయివాడు ఒక గోవును చంపే ప్రయత్నం లో ఉన్నాడు . ఆ గోవు భయం తో అటుఇటు పరిగెత్తుతుంది . కసాయి వాడు దాన్ని కర్ర తో కొట్టి అదుపు చేయాలి చూస్తున్నాడు .
గోవు ను తల్లి గా ఆరాదించే హిందువులు అసహయులై తలలు వంచుకొని దుకాణాల లో కూర్చొని ఈ దుర్మార్గపు చర్య ను నిస్సహాయంగా చూస్తున్నారు. బాల శివాజీ ఈ దురగాతని సహించలేక పోయాడు . వెంటనే తన ఓర లో నుండి ఖడ్గం తీసి ముందు కు లంగించి కసాయి వద్ద కు వెళ్ళాడు . తన ఖడ్గంతో కసాయి తో తలపడి గో మాత మెడ కు ఉన్న త్రాడు ను కోసివేశాడు , ఆవు పారిపోయింది.
శివాజీ దాడి లో ఆ కసాయి వాడు చనిపోయాడు . ఈ వార్త దావానం లా రాజ్యం లో వ్యాపించింది . బీజాపూర్ సుల్తాన్ దర్బార్ లో ఫిర్యాదు చేయబడింది . నవాబు క్రోదం తో వూగిపోయినాడు . రాజ్యాన్ని కి ప్రమాదం గ ప్రమాదం గ తయారవుతున్న తన కొడుకు ని బీజాపూర్ నుండి పంపివేయాలని నవాబ్ శివాజీ తండ్రి ని ఆదేశించాడు .
శివాజీ బీజాపూర్ ను వదిలిపెట్టాడు, కాని హిందూ సమరాజ్య స్థాపన స్వప్నాన్ని మాత్రం వదిలి పెట్టలేదు . దానిన్ తన హృదయం లో బద్రపర్చుకున్నాడు , కొన్ని సంవత్సరాలు తరువాత ఆ రోజు రానె వచ్చింది. ఏ రాజ్యం నుండి పంపివేయబద్దదో ఆ బీజాపూర్ సుల్తాన్ శివాజీ మహారాజ్ ను తన రాజ్యం లో స్వతంత్ర హిందూ సామ్రాట్ గ గుర్తించి ఆహ్వానించాడు. శివాజీ మహారాజ్ ఏనుగు ఫై ఊరేగుతూ బీజాపూర్ దర్బార్ లో ప్రవేశించాడు. సుల్తాన్ ముందుకువచ్చి స్వగతం పలికి శివాజీ ముందు శిరస్సు వంచాడు.
ప్రపంచం వంగుతుంది, వంచే వాడు కావాలి ( దునియా ఝుక్తి హై , ఝుకనేవల్ల చాహియే)
No comments:
Post a Comment