Friday, April 29, 2016

This Day 1982 ABVP activist Sama Jagan Mohan Reddy was killed by Naxalites for protecting the honour of Indian Flag

Shaheed Sama Jagan Mohan Reddy Amar Hain !!!

This Day in 1982 Kakatiya Univ Research Scholar ABVP activist Sama Jagan Mohan Reddy was killed by Naxalites in Hanumakonda. His crime was he protested when Naxalites on 26th January 1980 Republic Day tried to burn Indian National Flag . He fought with them seeing Tiranga being disrobed. With war cries of "Vande Mataram" & "Bharat Mata Ki Jai" he took over National Flag hoisted it back  on Kakatiya University Administrative building. This act of challenging them has angered the Naxalites, they way laid while he was coming from Dist Court and murdered him .

His Martyrdom has inspired many like me to join ABVP. Every time I remember the Martyrdom of this great patriot, I get emotional.

Shaheed Sama Jagan Mohan Reddy Amar Hain !!!

జాతీయ భావాలను నరనరాన నింపుకొన్న నవయువకులు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ (ఏబీవీపీ) కార్యకర్తలుగా పనిచేస్తున్న సందర్భంలో జరిగిన సైద్ధాంతిక సంఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు సామా జగన్‌ మోహన్‌రెడ్డి. జాతీయ జెండా గౌరవం కోసం ఒక సైనికుడిలా విదేశీ భావజాలం గల ముష్కరులను ఎదిరించి, తన ప్రాణాన్ని కూడా లెక్కచేయని వ్యక్తి ఆయన. వరంగల్‌ జిల్లాలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జగన్‌మోహన్‌ రెడ్డి, వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో లా కోర్సు చేస్తూ సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న తరుణం అది. 1980లలో క్యాంపస్‌లలో విద్యార్ధులు ఆర్‌.యస్‌.యు., మావోయిస్టుల హింసలకు భయపడాల్సిన పరిస్థితులుండేవి. ఈ నేపథ్యంలో, జగన్‌మోహన్‌ తోటి విద్యార్ధులతో కలిసి, కె.యు.
ఏబీవీపీ అధ్యక్షుడిగా విద్యార్ధి సమస్యలపై ఉద్యమాలు చేసేవాడు. దేశంపట్ల, దేశభక్తి వంటి అంశాల్లోనూ తన ఆలోచనలను విద్యార్ధులతో చర్చిస్తూ విభిన్న కార్యక్రమాలు రూపొందించేవాడు.

1980 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీ, విద్యార్థుల సమక్షంలో వైస్‌ ఛాన్సలర్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. అంతలోనే, వారందరూ చూస్తుండగానే రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఆర్‌.యస్‌.యు) మూకలు అక్కడికి చేరి ఎగురుతున్న ఆ మువ్వెన్నెల జెండాను కిందికి దించి దాని స్థానంలో నల్ల జెండాను ఎగరేసి బూటకపు స్వాతంత్య్రమనీ, బూటకపు రాజ్యాంగమనీ అవమానకరంగా నినాదాలు చేశారు. జాతీయ జెండాను తగలపెట్టడానికి ప్రయత్నించారు. విద్యార్ధుల మధ్య నుంచి భగత్‌ సింగ్‌లాగా ముందుకు వచ్చిన జగన్‌ మోహన్‌ ఈ చర్యలను నిరసిస్తూ వారికి ఎదురు తిరిగాడు. కొద్దిమంది విద్యార్ధులతో కలిసి ఆర్‌.యస్‌.యు. వారిని అక్కడి నుంచి తరిమికొట్టి, తిరంగా జెండాను తిరిగి ఎగురవేసి జాతి గౌరవం నిలిపాడు. ఆ తర్వాత ప్రభుత్వం పతాకానికి జరిగిన అవమానంపై ఎంక్వైరీ వేసింది. జస్టిస్‌ శ్రీరాములు ఎంక్వైరీకి యూనివర్సిటీకి వస్తే ఆర్‌.యస్‌.యు. వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి విద్యార్థులెవరూ ముందుకు వచ్చే ధైర్యం చేయలేదు. ఇది గమనించిన జగన్‌ మోహన్‌ ఈ దుశ్చర్యకు పాల్పడ్డ ముఖ్యమైన వారిపేర్లు చెప్పి ప్రధాన సాక్షిగా మారాడు.

ఇది ఆర్‌.యస్‌.యు. వారికి కంటగింపైంది. ప్రధాన సాక్షిగా కోర్టుకు వెళ్ళి వస్తున్న పలు సందర్భాల్లో జగన్‌ను చంపుతామంటూ ఆర్‌.యస్‌.యు, పి.డబ్ల్యు.జి. వారు హెచ్చరికలు చేశారు. అయినా ఆయన లెక్క చేయలేదు. 29 ఏప్రిల్‌ 1982న జగన్‌ కోర్టుకు హాజరై రిక్షాలో తిరిగి వస్తూ నిత్యం రద్దీగా ఉండే హన్మకొండ హెడ్‌ పోస్టాఫీస్‌ దగ్గరకు చేరుకోగానే, అక్కడ మాటువేసిన నక్సల్స్‌ గుంపు ఒక్కసారిగా జగన్‌పై కత్తులతో విరుచుకుపడి విచక్షణారహితంగా పొడిచారు. జాతీయ జెండాను రక్షించినందుకు, అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించి గణతంత్ర దినోత్స వాన్ని నిర్వహించినందుకు జగన అమరుడయ్యాడు. సామా జగన్‌ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, దేశాన్ని అవమానపరిచే శక్తులను తరిమికొట్టి, దేశ గౌరవాన్ని పెంచేందుకు పునరంకితం కావాలి.

~ABVP


No comments: