Telangana will be a reality during June 22-26 2011 ,
Says Prominent Astrologer Sri VBN Sharma
The following article is published in Andhra Jyothy daily on March 16 2011 . I’am reposting the same . Dr. V B N Sarma Kulapati (Jyothisha Vignana Peetam) Visiting Professor (Potti Sriramulu Tel. Univ.) Experience of more than 70 years in the field of Astrology. Learnt KP system from Sri KS Krishnamurti. VBN Sharma is resident of Hanumakonda .
జూన్లో తెలంగాణ
జూన్ 22-26 మధ్య తెలంగాణ ప్రకటన
ఆపై .. అధికార పార్టీకి నో చాన్స్
ఆపై .. అధికార పార్టీకి నో చాన్స్
హైదరాబాద్, మార్చి 15 : ఫాల్గుణ అమావాస్య ముగిసి, చైత్ర శుద్ధ పాడ్యమి అడుగుపెట్టే సమయం ఆధారంగా జగర్లగ్న కుండలిని వేయడం, ఆ కుండలి ఆధారంగా ఆ సంవత్సరం రాష్ట్ర, దేశ ఆర్థిక, రాజకీయ భవిష్యత్తును తెలుసుకోవడం మన సంప్రదాయం. ఈ ఏడాది జగర్లగ్న కుండలి పరిశీలిస్తే మీనరాశిలో ఆరు గ్రహాలున్నాయి. వీటిలో పాపగ్రహాలే అధికం. మన రాష్ట్ర లగ్నం మిథునరాశి. మన రాష్ట్ర లగ్నం గురించి భిన్న వాదనలు ఉన్నా సుదీర్ఘ కాలం ముస్లింల పాలనలో ఉండడాన్ని బట్టి చూస్తే మనది మిథున లగ్నం అనడం లో సందేహం లేదు. ఆ్రర్ద నక్షత్రం ముస్లింలకు వర్తిస్తుంది. ఈ అం శం కూడా మనది మిథున లగ్నం అనేందుకు మరో నిదర్శనం.
25 నుంచి ఉద్యమం తీవ్రం
మిథునం నుంచి దశమ స్థానంలో అంటే మీన రాశిలో ఆరు గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నింటికీ దశమాధిపతి అయిన శని దృష్టి ఏర్పడుతున్నది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వర కు రవి మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. ఫలితంగా ఈ నెల రోజులూ ఉద్యమం తీవ్రంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ నెల 25 నుంచి కుజుడు కూడా మీన రాశిలోకి వస్తున్నాడు.
శక్తి కారకుడైన కుజుడు దశమ స్థానం అయిన మీనంలోకి రావడం ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తుందన్నారు డాక్టర్ వీబీఎన్ శర్మ. లగ్నం నుంచి పదో స్థానం అధికారానికి, ప్రతిష్ఠకు, రాజ్యానికి సంకేతం. ఈ స్థానంలో ఉన్న ఆరుగ్రహాలకు అష్టమాధిపతి అయిన శని దృష్టి ఏర్పడుతున్నది. ఈ ఆరు గ్రహాల్లో ఒక్క గురువు తప్ప మిగిలినవన్నీ పాపగ్రహాలే. పాపులతో కలిసి ఉన్నందున బుధ, చంద్రులు కూడా పాపగ్రహాలే అవుతాయి. ఇన్ని పాప గ్రహాలకు శని దృష్టి ఏర్పడటం విశేషం.
జూన్ 22-26 మధ్య తెలంగాణ
'పాపదృష్టి బలిర్మద' అన్నది శాస్త్రం. అంటే పాపగ్రహాల దృష్టి ఏర్పడినప్పుడు మందుడు అంటే శనికి మరింత బలం వస్తుంది. 2009 డిసెంబర్ మొదటి వారంలోనూ ఇలాంటి దృష్టే ఏర్పడింది. వృశ్చికంలో ఉన్న రవికి, కన్యలో ఉన్న శనికి కేంద్ర దృష్టి ఏర్పడింది. అందువల్ల కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇప్పుడు కూడా అంతకు మించిన గ్రహదృష్టి ఏర్పడుతున్నది. ఫలితంగా కొత్త రాష్ట్రం ఏర్పాటు తప్పదు.
రవి మిథునంలో సంచరించే జూన్ 15 - జూలై 17 తేదీల మధ్య తెలంగాణ ఏర్పాటుపై అధికార ప్రకటన వెలువడుతుంది. ఈ నెల రోజుల్లో ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి అధికారిక ప్రకటన వెలువడుతుందో పరిశీలిద్దాం. జూన్ 22 నుంచి 26 తేదీల మధ్య తెలంగాణ రాష్ట్రానికి పచ్చజెండా ఊపడం త థ్యం. ఈ తేదీల మధ్య రవి ఆర్ద్రా నక్షత్రంలో సంచారం చేస్తాడు.
కె.పి. పద్ధతి ప్రకారం రాహు, గురు అంశలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్నారు డాక్టర్ శర్మ. మే 18న గురువు మేష రాశిలోకి వెళ్లిపోతాడు. రాజ్యాధిపతి మేషంలో సంచరిస్తున్నప్పుడు పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయి. లగ్నం నుంచి లాభ స్థానంలోకి గురువు ప్రవేశం వల్ల రాష్ట్రంలో శుభపరిణామాలు చోటుచేసుకొంటాయి. శని దృష్టి కూడా తొలగిపోతుంది కాట్టి రాష్ట్రం ఏర్పాటు సజావుగా సాగిపోతుంది. ఉభయ రాష్ట్రాలూ సుభిక్షంగా ఉంటాయన్నారాయన.
అధికారపార్టీకి శని దెబ్బ!
శని గ్రహానికి చట్టప్రకారం నడుచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. దశమ స్థానం రాజ్యస్థానం. అధికార స్థానం. పరువు, ప్రతిష్ఠలకు కూడా దశమ స్థానమే ప్రధానం. ఇన్ని గ్రహాలకు శని ప్రతికూల దృష్టి ఏర్పడింది కాబట్టి ఎంతటి మహామహులు వచ్చినా సజావుగా రాష్ట్రాన్ని పాలించలేరు. వారి ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది. శని దృష్టి కారణంగా పరిపాలన అస్తవ్యస్తం అవుతుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ గ్రహకూటమి కారణంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.
మన రాష్ట్రంలోనే కాదు.. త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఈ గ్రహదృష్టి వల్ల అధికార పార్టీలు ఓటమి పాలయ్యే అవకాశాలే అధికం అన్నా రు డాక్టర్ శర్మ. ఇకపోతే లగ్నం నుంచి 11వ స్థానం మేషం. 11వ స్థానం అసెంబ్లీ, పార్లమెంటుకు సంకేతంగా చెప్పుకొంటాం. మేషానికి అధిపతి అయిన కుజుడికి కూడా శని దృష్టి ఏర్పడింది. ఫలితంగా రాజకీయ ప్రముఖులకు అపమృత్యు గండం ఏర్పడుతుందన్నారు డాక్టర్ శర్మ.
ఎవరీ శర్మాజీ...
హన్మకొండకు చెందిన 84 ఏళ్ల వీబీఎన్ శర్మ మన రాష్ట్రంలో ప్రముఖులెందరికో భవిష్యవాణి వినిపించారు. వి.వి. గిరి ఉపరాష్ట్రపతి పదవిని చేపడతారని, అది కూడా రెండోసారి లెక్కింపు తర్వాతే గెలుస్తారని జ్యోతిషం చెప్పి అందరి మన్ననలు అందుకున్నారు. ఆరు దశాబ్దాలుగా హన్మకొండలో జ్యోతిష విజ్ఞాన పీఠం ఏర్పాటు చేసి శాస్త్ర విజ్ఞానాన్ని కొత్త తరానికి పంచుతున్నారు. పీఠానికి ఆయన కులపతిగా కొనసాగుతున్నారు.
అమెరికాతో పాటు పలు దేశాల్లో అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని భారత జ్యోతిష వైభవాన్ని దశదిశలా చాటారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్గా కొనసాగుతున్న డాక ్టర్ శర్మ మాతా ఉపాసకులు. మంత్రశాస్త్ర నిపుణులు. నాలుగు దశాబ్దాలుగా కాకతీయ పంచాగాన్ని ప్రచురిస్తున్న శర్మ పూర్ణ దీక్షాపరులు.

No comments:
Post a Comment