Sunday, May 1, 2011

Satya Sai Baba, you will always be remebered as a spiritual- social activistనిన్ను ఏ నాడు దర్శించ లేదు, నిన్ను ఏ నాడు ఆరాధించలేదు , ఎన్నడు పెద్దగ నీ గురించి ఆలోచించలేదు . కానీ నీవు పరలోక సిద్దిన్చినప్పటి నుండి ఏదో లోటు గా ఉంది. ఒక్క గొప్ప సేవ పురుషుడిని జాతి కోలిపోయింది  అని బాద . నిన్ను దేవుడు అని అన్నారు , దేవ దూత గా కీర్తించినారు , మహిమలు గల యోగ పురుశుడు అన్నారు , ఏమో అవి ఏమి నాకు తెలీదు . నాకు  మాత్రం నీవు గొప్ప సేవ పురుశుడివి , పురుశులలో  ఉత్తముడివి , "పురుశోత్తముడివి"

స్వామి వివేకానంద , కంచి పరమాచార్యులు , రమణ మహరిషి , శ్రీ అరొబిందో లాంటి  మహానుభావులు  ఎన్నో తత్తవాలను ప్రబోదించారు . మనవ సేవే మాధవ సేవని వీరంతా చాటి చెప్పినారు . కానీ, వాళ్ళ బోధనలను ఆచరణలో పెట్టడం నీకు మాత్రమే సద్యమైనది . అద్యాత్మికత పరామార్డం ప్రజా సేవే అని చాటి చెప్పిన గొప్ప “ఆద్యాత్మిక విప్లవకారుడివి” నీవు . నీ సేవ ప్రకల్పల ద్వార , యే దిక్కు లేని వాళ్ళకు , నీవు దిక్కు చూపి వాళ్ళ జీవితం లో సూర్యుడి వలె వెలిగావు . అందుకే , ఆ సూర్య- చంద్రులు ఉన్నంత కాలం నీ నామ స్మరణం ఈ భూమి ఫై జర్గుతూనే ఉంటది .

నీవు ఆసుపత్రి లో ఉన్నుపుడు కూడా నాలో ఏ కొసన బాద లేకుండే . నీవు లేచి వస్తావని ప్రగాడమైన నమ్మకం . నా మిత్రుడు ఒక్కరు, ఓ రాత్రి ఏంటి బాబా బతికి వస్తాడ అని అమర్యాదగా నన్ను అడిగినప్పుడు , నా కోపం నషాళానికి ఎక్కింది . నా కోపమును అదుపు లో పెట్టుకుంటూ " తప్పకుంట వస్తాడు , బాబా సంకల్పిస్తే ఇప్పుడే లేచి వస్తాడు” అని అన్న. ఏమో ఆ క్షణాన నీ ఫై ఏదో ప్రేమ , ఎంతొ నమ్మకం . నీవు వస్తావు…….  సమాజాన్ని , భక్తీ ని మానవ సేవ వైపు తెస్కేల్తావు అని నమ్మాను . నీవు తిరిగి రావాలని మనస్పూర్తి గా కోరుకున్నాను . నీవు 96 ఏళ్ళు జీవిస్తాను అన్న నీ మాటలను అమాయకంగా నమ్మాను , కానీ నీవు మాట తప్పవు , మోసం చేసావు.

నాకు ‘నీవు’ ఆ సమాధి చేయబడ్డ నీ బౌతిక కాయం కాదు , అందరు అంటున్నట్టు నీ శరీరం ను వదిలేసినా ఆ ఆత్మ స్వరూపం కాదు ( ఏమో నాకు ఆత్మ ల గురుంచి పరమాత్మా ల గురుంచి పెద్దగా తెలియదు ) నా దృష్టిలో  నీవు అంటే నీవు చేసిన ఆ సేవ కార్యక్రమాలు . నిస్సందేహంగా నీయొక్క  ఆ సేవ ద్రుక్పతమే నన్ను నీ ప్రేమికుడి గా చేసింది . కానీ అది ఏంటో కానీ నేను నీ ప్రేమికుడిని అన్న విషయం, నీవు నిర్వాణం చెందే వరకు నాకే తెలీదు . నీవు ఆ పంచబుతలలో కలిసాక గాని తెలిసి రాలేదు . అందుకే నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను  చాల కాలం నుండి నిన్ను ప్రేమించే ఓ “అజ్ఞాత ప్రేమికుడిని” అని .

నాలాంటి  “అజ్ఞాత ప్రేమికులు” , నీకు కొక్కోలుగా ఉన్నారని, నీవు పోయాకే తెలిసింది. నీ ఫై నీచంగా పాటలు రాసి, ఆడి-పాడినా తెలంగాణా గద్దర్ కానీ , హేతువాదులు , నాస్తికులు అందరు నీవు ఇక లేవని తెలిసి మౌనంగ   రోదిస్తున్నారు . కమ్యునిస్టు లు కూడా నిన్ను గొప్ప  హ్యుమనిస్టు గా కిర్తిస్తున్నారు, ఇప్పుడు . 

ఆ నాటి కాలంలో శిశుపాలుడు కృష్ణుడిని నీచంగా దుశిస్తే , 100 తప్పుల వరకే ఓపిక పట్టి ఆ తర్వాత కృష్ణుడు సహితం ఓర్పు నశించి అతని బంధువు (విరోధి) అయిన సిశుపాలకుడి ని సంహరించాడు . కానీ నీ ఫై వందల సంఖ్యలో శిశుపాలకులు దాడి చేసి దూషించిన, నీవు ఎవ్వరిని నీ శత్రువు గా భావించలేదు . నీ ప్రేమ గుణం తో, సేవ కార్యక్రమాలు తో వారి మనసులను జయించావు. ఆ శిశుపాలక సమానులైన వారిని సైతం, నీ ఆరాధకులుగా మర్చుకున్నావ్ . ఇలా విరోధుల హృదయాలను జయించుట దైవత్వం అయితే నిస్సందేహంగా నీవు కృష్ణుడిని మించిన దైవ స్వరుపుడివి .

1 comment:

Anonymous said...

Very moving one....i was in tears almost