Monday, July 4, 2011

Historical moments unveiled today in Telangana, MLA's, MP's & MLC's resign enmasse


ఈ రోజు విశాఖపట్నం ముద్దు బిడ్డ , మాన్యం మహారాజు అల్లూరి సీతారామ రాజు (జయంతి) పుట్టిన  రోజు.  నల్గొండ జిల్లా లో, నిజాం రాజు నిరంకుశ పాలనను  ఎదిరించి తుపాకీ  గుళ్ళకు బలియినా అమర వీరుడు దొడ్డి కొమరయ్య ప్రాణ త్యాగం చేసిన రోజు. నిన్న గోల్కొండ లో బయలుదేరిన దుర్గమ్మ ఈ రోజు తెలంగాణా అన్ని గుడి లో అడుగు పెట్టి బోనాలు శుభా ప్రారంబం అయ్యే రోజు . ఈ రోజు అమెరిక దేశానికి స్వతంత్రం సిద్దించిన రోజు , ఈ రోజే తెలంగాణా స్వాతంత్రానికి అసెంబ్లీ , పార్లమెంట్ వేదిక గా యుద్ద శంఖనాదం మ్రోగిన రోజు, 4.5 కోట్ల తెలంగాణా ప్రజలకు నేడు పండుగ రోజు.

ఈ రోజు చరిత్ర పుట్టల్లో మరో ఘట్టం  ఆవిష్కారం అయ్యే రోజు . 73మంది MLA లు , 11 మంది MPలు మరీయు 15 మంది MLC లు తెలంగాణా ప్రజల ఆకాంక్ష కు అనుగుణంగా రాజీనామా చేసిన రోజు . భూమి కోసం , భుక్తి కోసం , బతుకు కోసం సీమంధ్ర రాజకీయ దోపిడీ దొంగల నుండి ముక్తి కోసము నేతలంత జెండా లు అజెండాలు పక్కన బెట్టి , తెలంగాణా స్వతంత్రం కోసం పిడికిలు బిగించి , ఒక్క తాటి ఫై వచ్చి యుద్ధ భేరి మోగించిన రోజు.

తెలంగాణా చీమల దండు కదిలింది , డిల్లి పాములా గుండె అదిరింది . రాజీనామాల తో తెలంగాణా పొట్టేళ్ళు ముందుకు డుకినాయ్, సీమంధ్ర రాజకీయ నక్కలు పరుగులు తీస్తున్నాయ్. రాజీనామాల తో  తెలంగాణా వీరులు పోరు బట లో కదిలిండ్రు  దండోరా మొగిన్చిండ్రు,  గల్లి - గల్లి లో కదిలినారు డిల్లి వైపు వెళ్తున్నారు , దడ- దడ ఉరుములవలె డిల్లి  వీధులలో ఉరుముతున్నారు , డిల్లి నవాబులు గడ గడ లాడుతున్నారు , గమ్యాని ముద్దదేదాక ,  తెలంగాణా రాష్ట్రం వచ్చేదాకా మడమ తిప్పమంతున్నారు

  తెలంగాణా అమరవీరుల ఆశయాల సాధన కై  రాజకీయ పదవులను త్రుణ  ప్రయముగా త్యాగం చేసిన మా త్యగాదనులకు మా ఉద్యమ జోహారులు. రాజీనామా చేసిన మా ప్రాంత నాయకులు మా హృదయాలు జయించినారు , మా హృదయ సామ్రాట్ లై నిలిచినారు . కష్ట నష్టాలూ ఎన్ని ఎదురైనా సరే, మా త్యగాదనులరా మిమ్ములను  గుండె లో పెట్టుకొని గుడి కట్టుకుంతం, మీ వెంట  4.5 కోట్ల తెలంగాణా ప్రజలు భుజం తో భుజం కలిసి  మీ వెంట నడుస్తాం . రాజీనామా చేయని నాయకులను మాత్రం వెంటాడి వేటాడి తరుముతాం .

హైదరాబాద్ MLAలు తెలంగాణా కోసం రాజీనామా చేయరని విష ప్రచారం చేసిన సీమంధ్ర మీడియా కు చెంప పెట్టు పెట్టాడు PJR కుమారుడు మా జూబిలీహిల్స్ MLA విష్ణువర్ధన్ రెడ్డి . అందరికన్నా ముందు రాజీనామా చేసి మిగితా వారిక ఆదర్శంగా నిలిచినాడు. ఆంధ్ర సెట్టిలర్లు ఎక్కవగ ఉండే జూబిలీ హిల్స్ MLA పదవి కి రాజీనామా చేయడం సాహసం తో కూడినది . ఇలాంటి త్యగాదనులను ఎన్నటికి మరవం. విష్ణువర్ధన్ రెడ్డి నిన్ను మా గుండెలో దాచుకుంటాం .
ఓరి సీమంధ్ర నాయకులారా....  మీరు  ఇంత కాలం,  ఒళ్ళ పొగరు తో  నా తెలంగాణా ను కాల్చివేసారు , మీ దగ్గర రాజకీయ శక్తి ఉంది గదాని , అదికార గణం ఉంది అని , మీ వద్ద ధనం ఉంది గదాని, ఇశ్వర్య మదం తో మీరు చేసిన అన్యాయం కు ఇక రోజులు దగ్గర పడ్డాయి ... తెలంగాణా బిడ్డ ఇప్పుడు యుద్ద బాట పట్టిండు , పిడికిలు బిగించిండు , ఇక నీ దోపిడీ పాలనా ఎక్కువ రోజులు సాగదు , సాగదు, సాగదు.

No comments: