Thursday, July 21, 2011

A Telangana Martyr's Suicicide note



The below is the suicide note of Sri Adi Reddy who committed suicide at  Delhi's India Gate on 20 July for the cause of Telangana State . My voice choked and tears rolled down my cheeks, as i read his suicide letter.

ఆత్మహత్యకు ముందు యాదిరెడ్డి రాసిన పూర్తిలేఖ..ఉన్నది ఉన్నట్టుగా

సోనియా గాంధీజీ హమారా తెలంగాణ హమ్‌కో దేదో. మేరా ఆఖ్రీ ఇచ్చా హై. సోనియాజీ, రాహుల్‌జీ, ప్రధాన్‌మంవూతీజీ మేరా లాష్‌కో దేఖ్‌కే దేశ్ కా ప్రెస్ వాలొంకో మేరా విన్నప్ హై కీ ఆప్‌కా వీడియో కెమెరాస్ హమారా తెలంగాణ తరఫ్ మీడియా శ్రీ కృష్ణ కమిటీ 8 చాప్టర్ దేశ్ కా సామ్‌నే రఖియే.

హైద్రాబాద్‌లో ట్రేన్ ఎక్కే ముందు ఎన్నో విధాలుగా ఆలోచించిన. నేనేప్పుడో అనుకున్న 17-07-2011 లోపు ఎలాంటి ప్రకటన రాకుంటే ఢిల్లీ వెళ్లి ప్రాణత్యాగం చెయ్యాలని. నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్న. ఎందుకో నా మనసు శాంతంగా ఉంది. అమ్మతో మాట్లాడిన. చెల్లితో కూడా మాట్లాడినా. ఇక్కడికి వచ్చేముందు అమ్మను చూసి, అమ్మ చేతివంట కడుపు నిండా తిని, అమ్మ ఆశీర్వాదం తీసుకుని వద్దామనుకున్నా. కానీ నా లక్ష్యం కోసం ఎక్కడ వెనుకడుగు వేస్తానో అని భయం వేసి వెళ్లలేదు. నేను హైద్రాబాద్‌లో ట్రైన్ ఎక్కేసరికి ఏమీ అర్థం కాలే. ఈ ప్రాంతాన్ని వదిలి పోతున్న.

నేను ఎన్నో కలలు కన్న నా తెలంగాణను వీడిపోతున్న. మనసంతా భాద. నిజం చెప్పాలంటే నాకు తెల్వకుండనే ఇక్కడికి వచ్చిన. మనసులో ఒక్కటే ఉన్నది. ఇంకేం ఆలోచిస్తలేదు. నేను అనుకున్నది సాధిస్తా. అనుకున్నది చేస్తా. తెలంగాణ విముక్తి కోసం నేను ఉద్యమంలో ఒక బిందువునైతా. తెలంగాణ ప్రజలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నరు. అదే సీమాంవూధలో ఎవడో చెబితే చేస్తున్నరు. ఇక్కడ తెలంగాణ వాళ్లకు ఒక్కటే తేడా. తెలంగాణలో ఉద్యమం తెలంగాణ కోసం చేస్తున్నరు. సీమాంవూధల చేపిస్తున్నరు. స్వచ్ఛందంగా చేయడం లేదు. ఎవడో లగడపాటిలాంటి కుక్కలు ఉసిగొలిపితే చేస్తుండ్రు వారు. తెలంగాణ ఎందుకు కావాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. అదే సమైక్యాంవూధకు కారణం ఒకటే చెబుతరు. అభివృద్ధి ఇది తప్ప వాళ్ల దగ్గర ఇంకేమీ ఉండదు. రుచి మరిగిన కుక్కలు ఊరికెనే వదులుతాయా, తరిమి కొట్టాలే, తరిమి తరిమి కొట్టాలె.

అప్పుడే తెలంగాణకు శాంతి. తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ వేరు కావాల్సిందే. మా భూమి, మా కొలువులు, మా నీళ్లు మాకు న్యాయంగా దక్కాలె. కాని ఇప్పుడు జరుగుతుంది వేరు. అనుబవించుడు వాళ్లు. అభివృద్ధి చేసినం అని చెప్తుండ్రు. అన్యాయంగా దోచుకునుడు తప్పితే, ఏం లేదు. తెలంగాణ రావాలని తెలంగాణ మొత్తం ఎదురుచూస్తున్నది. దొంగ దానం నాగేందర్, సర్వే, జైపాల్ రెడ్డి లాంటి ద్రోహులు తప్ప. వీళ్లు దొంగలల్ల కలిసిండ్రు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం. బయటి కన్నా ఇంటి దొంగలే ఎక్కువ మోసం.

జైపాల్‌డ్డి గారూ, మీరు నా నియోజకవర్గం అని చెప్పకోవడానికి సిగ్గుపడుతున్నా. తెలంగాణ కోసం మీరు రాజీనామా చేసి ఉంటే మిమ్మల్ని దేవుని లెక్క చూస్తుండె. తెలంగాణ ప్రజల ప్రాణాల కంటే మీకు పదవి ఎక్కువైంది. మీకు ఓట్లు వేసిన ప్రజలే మీ పేరు చెబితే చీదరించుకుంటున్నారు. ఇప్పటికైనా రాజీనామా చెయ్యాలె. మిగితావాళ్లను చేసే విధంగా ఒప్పియ్యాలె. తెలంగాణ కన్నా ఏదీ ఎక్కువ కాదు.

దానం నాగేందర్, ముఖేశన్నకు నా విజ్ఞప్తి. మీరు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డరు. ఇప్పటికన్నా ఇక్కడి ప్రజల ఆకాంక్షను మీరు గుర్తించండి. మనల్ని మనమే తిట్టుకుంట సీమాంధ్ర నాయకులకు తొవ్వ చూపిస్తున్నము. తెలంగాణ కోసం నేను నా ప్రాణం ఇస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను కోరుకునేది ఒక్కటే. అందరూ ఒక్కటి కావాలె, తెలంగాణ సాధించాలె. తెలంగాణ కోసం ముందుకు రాని వాళ్లను ఎవరూ ఏమనొద్దు. కానీ తెలంగాణ దెబ్బ ఎట్లుండాలంటే వాళ్లు మల్లా ఎసుంటి పదవి కాదు, వాళ్ల రాజకీయమే నాశనం అయ్యేటట్లు చెయ్యాలె. తెలంగాణ వాళ్లు ఓట్లు వెయ్యకపోతే సీమాంధ్ర నుండి ఇక్కడికి వచ్చిన వాళ్లు ఓట్లు వేస్తరని మీరు అనుకోవచ్చు. కానీ వాళ్లు కూడా తెలంగాణకు అనుకూలం అని మీరు మరిచిపోకుండ్రి.

సోనియాగాంధీజీ
సోనియాగాంధీ గారు మీరు తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర నాయకులు అడ్డంగా సంపాదించిన ఆస్తుల గురించి ఆలోచిస్తున్నరు. మీరు మౌనం వీడండి. తెలంగాణ ఇవ్వండి. నాకు చాలా భయంగా ఉంది. మీ పార్టీ తెలంగాణల రోజుకో డ్రామా ఆడుతున్నరు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇప్పటికీ నమ్మే పరిస్థితి లేదు. వాళ్లు రాజీనామా చేసినా, నిరాహార దీక్ష చేసినా మీరు చేపిస్తున్నరని అందరి అనుమానం. తెలంగాణల ఇప్పటి వరకు 600 మందికి పైన విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిండ్రు. మిగితా సోదర సోదరీలను కలిపితే ఆ సంఖ్య వెయ్యి దాటుతదేమో. సీమాంవూధులతో మేము ఇంకా అయిదు, పది ఏండ్లు ఉంటే మా తెలంగాణ ఉనికికే ప్రమాదం. తెలంగాణనా ఎక్కడి తెలంగాణ. ఆంధ్ర ఆంధ్రవూపదేశ్ అని అనే పరిస్థితి వస్తది. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర మంటగలిసి పోతది. తెలంగాణ, తెలంగాణ ప్రజలు బాగుండాలంటే తెలంగాణ ఇచ్చి తీరాల్సిందే. తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకు దక్కాలంటే తెలంగాణ వేరు కావాల్సిందే. తెలంగాణల ఉద్యమం మీ పార్టీ చేతులకు పోతదేమో అని భయంగా ఉంది. నాయకులు, తెలంగాణ ప్రజలు మొత్తం తెలంగాణ కావాలని కోరుకుంటున్నరు. అలుపెరుగని ఉద్యమం చేస్తున్నది మా తెలంగాణ మాకు ఇవ్వండి. మాకు విముక్తి ఇవ్వండి.

ప్రధానమంవూతిగారూ,
మా తెలంగాణను అడిగితే అంతమంది పోలీసులు ఎందుకు? మరి తెలంగాణ పాకిస్థాన్ బార్డరా? బంగ్లాదేశ్ బార్డరా? మేము వేరే దేశం అడుగుతలేం. భారత రాజ్యాంగానుసారం మా హక్కును అడుగుతున్నం. మా హక్కుని అడిగితే అణిచివేస్తుండ్రు. ఇదెక్కడి న్యాయం. తెలంగాణ ప్రజలు భారతీయులు కారా? తెలంగాణ ప్రజలు తమకు అన్యాయం జరిగింది కాబట్టే మా తెలంగాణ మాకు ఇయ్యమని అడుగుతున్నరు. అయినా కొత్తగా రాష్ట్రం అడుగతలేము. ఉన్న తెలంగాణను ఇయ్యమంటున్నం. మీరు మమ్మలను సంతోషంగా బతకాలని కోరుకుంటే వెంటనే తెలంగాణ ఇయ్యండి. సీమాంధ్ర ప్రజలు మా తెలంగాణల స్థిరపడిన వాళ్లు తెలంగాణల పూర్తి స్వేచ్ఛగా బతుకుతున్నరు. ఉంటరు. కొందరు దొంగ నాయకులు వాళ్లకు లేనిపోని మాయమాటలు చెప్పి భయవూభాంతులకు గురిచేస్తున్నరు.

వాళ్ళు సంఘవివూదోహులకింద లెక్కనే. సీమాంధ్ర నాయకులకు గాని అధికారులకు గాని వాళ్ల పెట్టుబడులు న్యాయబద్ధం అయితే భయమెందుకు? వాళ్లు అన్యాయంగా ఆస్తులు సంపాదించిండ్రు. అందుకే భయం. ఇగ వాళ్ల మీడియా తెలంగాణ సింగపూర్ లెక్క ఉన్నదని చూపిస్తరు. వాస్తవం ఏంది అనేది వాళ్లకు తెలుసు. తెలంగాణ ప్రజలు అసలు సిసలైన భారతీయులు. అందుకే శాంతియుతంగా గొప్ప మార్గంలో ఉద్యమిస్తున్నరు. ఎవరన్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వాళ్లను ఏమీ అనడం లేదు. ఇప్పటి వరకు మా నాయకులనే మేము అన్నంగానీ వాళ్లను గుడ్లతో, టమాటాలతో కొట్టలేదు. ప్రధానమంవూతిగారూ... మా తెలంగాణ మాకు ఇవ్వండి. తెలంగాణను విముక్తి చేయండి.

సీమాంవూధవాళ్లు మా కొలువలల్ల అన్యాయంగా ఉన్నరు. మా నీళ్లను మళ్లించుకున్నరు. మా వనరులను దోచుకున్నరు. మా తెలంగాణ పదవులు వాళ్లే అనుభవిస్తున్నరు. తెలంగాణ భూములలో 60 శాతం వాళ్ల చేతులల్లనే ఉన్నయి. ఇది పెద్దమనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించి చేసిందే. అయనా ఇప్పటివరకు తెలంగాణకు దేంట్లో న్యాయం జరిగిందని? ముల్కి నిబంధనలు అమలు కాలే. దొంగ జీవో 610 అమలుకాలే. తెలంగాణకు అన్యాయం జరిగింది. జరుగుతూనే ఉన్నది. ఇప్పటికన్నా తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ మనుగడే ప్రశ్నార్థకం అయితది. వాళ్లు మా ప్రాంతంను కబ్జా చేసిండ్రు. మా కుటుంబాలను కూడా కబ్జా చేస్తున్నరు. నా కుటుంబంలనే ఒక ఆంధ్రది వచ్చింది. మా నాయన సావుకు కారణమైంది. నా నాయనమ్మకి విషమిచ్చి చంపించింది.

ఇప్పుడున్న మా నాన్న తమ్ముడిని ఏదో ఒక రోజున సంపుతది. మాకు వాళ్ల ఆస్తి అక్కరలేదు. ఆయన బాగుంటే చాలు. హైద్రాబాద్‌లో ఉన్న భూములు ఎక్కడికి పోయాయి. ప్రభుత్వ భూములు ఎట్లా అన్యాక్షికాంతం అయ్యాయి. అవి ఎవరి చేతుల్లో ఉన్నాయి. హైద్రాబాద్ సీమాంవూధతో కలిసినప్పుడు ఎలాంటి షరతులు విధించిండ్రు. అవి ఎంతవరకు అమలు జరిగినయి. తెలంగాణకు ఇప్పటి వరకు ఏ అభివృద్ధి మండలి న్యాయం చేసంది. ఇప్పటి వరకు ఎన్ని కమిటీలు వేసిండ్రు. ఏ కమిటీ అమలు కాలే. తెలంగాణకు అన్యాయమే జరిగింది. 610 అన్నరు. ముల్కి అన్నరు. ఏవీ అమలు కాలేదు. సీమాంధ్ర నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ఇయ్యాల్సిందే. మాకు ఏ అభివృద్ధి మండలి వద్దు. తెలంగాణ కావాలే. హైద్రాబాద్ రాజధానిగా ఉండాలె. హైద్రాబాద్ తెలంగాణ సొత్తు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ అభివృద్ధి చెందింది అని అంటున్నరు. మరి అభివృద్ధి మండలి ఎందుకు అంటే వాళ్లే చెబుతున్నరు తెలంగాణ వెనుకబడి ఉన్నదని. మాకు ఏ మండలి వద్దు. ఏ ప్యాకేజీ వద్దు. తెలంగాణ కావాలే.

సీమాంధ్ర ప్రజలంటే తెలంగాణ వాళ్లకు ఎలాంటి ద్వేషంకాని, పగకాని లేవు. అట్లుంటే ఉద్యమం ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా వాళ్లతో కలిసిమెలిసి ఎట్లుంటరు? వాళ్ల దగ్గర పనికి ఎందుకు పోతరు? వాళ్లతో కలిసి దందాలు ఎందుకు చేస్తరు? సీమాంవూధుల మీద నిజంగా కోపం ఉంటే వాళ్లు మా హైద్రాబాద్‌ల ఉండేటోళ్లా? ప్రతీ సీమాంధ్ర నాయకులకు ప్రజలకు తెలుసు హైద్రాబాద్ తెలంగాణ గుండె అని. సీమాంధ్ర ప్రజలకు కూడా వాళ్లక సొంత రాజధాని కావాలని ఆకాంక్ష ఉన్నది. కానీ కొందరు దొంగ నాయకులు సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు. సీమాంధ్ర ప్రజలు ఇప్పటికైనా మీరు సొంత రాజధానిని నిర్మించుకొండి. మీరు మా శత్రువులు కాదు.

మీరు అంతో ఇంతో చాలా బాగున్నరు. మీ నాయకులు మాకు అడ్డుపడకుండా వాళ్లను నిలదీయండి. మద్రాసు నుండి హైద్రాబాద్, ఇక్కడి నుండి ఇంకో దగ్గరికి ఎందుకు? ఇట్లా మీకు సొంత రాజధాని ఉంటే చాలా బాగుంటది. హైద్రాబాద్ తెలంగాణ సొత్తు. తెలంగాణ రక్తం, తెలంగాణ శ్రమతో నిర్మిచబడ్డది. తెలంగాణ నుండి హైద్రాబాద్ వేరు అనే ఊహ కూడా భరించలేం.తెలంగాణల మీ డ్రామా ఆపెయ్యండి. తెలంగాణ కోసం ఇంకో ఒక్క చావు. నేను బూడిదవుతున్నాను. తెలంగాణల ఒక్క ప్రాణం పోకూడదు. అట్ల పోకూడదంటే తెలంగాణ ఇయ్యండి. తెలంగాణ కోసం నాదే చివరి బలిదానం కావాలె. ఇంక ఎవ్వరూ ప్రాణం తీసుకోవద్దు. తెలంగాణను మీరు ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది.

నేను ఇద్దరిని క్షమించమని అడుగుతున్న
అమ్మా నన్ను క్షమించు. నేను తెలంగాణ కోసం వెళ్లిపోతున్నాను. నిన్ను నేను చాలా బాధపెట్టిన.. ఇందు నన్ను మన్నించు. ఇన్ని రోజులు నాకు తోడుగా ఉన్నావు. నీకు అన్యాయం చెయ్యలేను. నాకు ఏం చెయ్యాలో అర్థం అయిత లేదు.
జై తెలంగాణ

2 comments:

Unknown said...

jai telangana....!!!!
jai jai telangana.....!!!!
johaar telangana amaraveerulaku ...!!!

Unknown said...

jai telangana...!!!!
jai jai telangana...!!!!
johaar telangana amara veerulaku..!!!
JOHAAR....